"యువతా మేలుకో.., ఇనుప కండలు.. ఉక్కునరాలే దేశానికి రక్ష. దేశ గతిని మార్చే శక్తి యువతకే ఉంది" అంటూ ఉద్భోధించిన మహా మనిషి వివేకానంద. ఈ రోజు మన వివేకానందుడి జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం. ఇంకో విశేషమేమిటంటే ఈరోజు మన రెడ్ స్టార్ రెండవ ఆవిర్భావ దినోత్సవం.
మహా మనిషికి ముందుగా మన రెడ్ స్టార్ యూత్ తరపున జన్మదిన శుభకాంక్షలు.

"మతమంటే చర్చికిపోవటం కాదు. ముఖంమీద బొట్టుపెట్టుకోవటం కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్నిరకాల రంగులతో మీ శరీరాలమీద రంగులు పూసుకోవచ్చుగాక. కానీ మీ హృదయం వికసించకపోతే, మీకు ఆత్మసాక్షాత్కారం జరగకపోతే అంతా వ్యర్ధమే.మనిషిలోని దివ్యత్వాన్ని అభివ్యక్తపరచడమే మతమంటే".
మూఢాచర మత్తులో జోగుతున్న భారతీయుల వీపులను చళ్లున చరచిన వ్యాఖ్యలవి. నిందారపణలతో, పరుషపదాలంతో అవతలి మతస్ధులను సమూలంగా ఉత్తరిస్తామంటూ బయలుదేరిన వాచాలుర కళ్లు తెరిపించాల్సిన మాటలివి. జాతి, మత, వర్ణ, వర్గ, కుల విభేదాలను అధిగమించి ఏకతాటిపై నిలిపే పంచాక్షరీ మంత్రం 'భారతీయత'. మనిషి జీవితంలోమానవత్వపు విలువలనుసుప్రతిష్టం చేయడమే మతాల సారం. హృదయంలో ప్రారంభమయ్యే ఆ గుణాత్మక మార్పు మొత్తంగా మనిషి జీవిత సరళినే మార్చివేస్తుంది.

మనిషిని మానవోత్తముడిని చేయడం గురించే వివేకానందుడి తాపత్రయమంతా...!!!
మరికొన్ని వివేకానందుడి సూక్తులు...
"మంచి సేవకుడే మంచి నాయకుడు.."
"సవాళ్లని ధైర్యంగా ఎదుర్కో... అవి జీవిత పాఠాలు నేర్పే ప్రియనేస్తాలు.."
"ప్రపంచంలోకి వెలుగులు తీసుకురండి. వెలుగు మరిన్ని వెలుగులను విరబూయిస్తుంది. సర్వమనవాళీ తేజోవంతమై ప్రకాశిస్తుంది"
మీ
రెడ్ స్టార్ యూత్[SVASA], కొత్తవలస
0 comments:
Post a Comment