నా జీవితం - ఒక పున్నమి వెన్నెల..,
కానీ అది చీకటి తరువాతే వచ్చింది..!!
నా జీవితం- ఒక కడిగిన ముత్యం..,
కానీ అది మహాసముద్రం వడకడితే దొరికింది..!!
నా జీవితం- ఒక ప్రశాంతమైన వాతావరణం..,
కానీ అది ఒక ప్రళయం తరువాత ఏర్పడింది..!!
నా జీవితం- ఒక అందమైన గోదావరి తీరం..,
కానీ అది నా మనసులో నీ రూపం చూశాక అనిపించింది..!!
-మీ ధనుంజయ్
0 comments:
Post a Comment